ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు ఒక్క అవకాశం ఇవ్వండి : జనసేన అధినేత

by Aamani |   ( Updated:22 Nov 2023 2:29 PM  )
ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు ఒక్క అవకాశం ఇవ్వండి  : జనసేన అధినేత
X

దిశ, కరీమాబాద్ : వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు కు మద్దతుగా బుధవారం హంటర్ రోడ్ లోని సిఎస్ఆర్ గార్డెన్స్ వద్ద ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీగా అభిమానులు కదలివచ్చారు. ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన కూడా పోటీ చేస్తుందని వరంగల్ తూర్పులో ఎర్రబెల్లి ప్రదీప్ రావు కి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

జనసైనికులంతా ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ గెలుపొందడానికి కృషి చేయాలన్నారు. ప్రదీప్ రావు వ్యక్తిగతంగా కూడా చాలా సౌమ్యుడు అని, అవినీతికి దూరంగా, వివాదరహితుడిగా పేరుందని తెలిపారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భం నుంచి చూస్తున్నానని, ప్రజల్లో మంచి ఆధరణ ఉన్నదని, తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై ఇంత అవగాహన ఉన్న నాయకుడిని గెలిపించుకుంటే అభివృద్ధి అనేది వేగంగా జరుగుతుందని సూచించారు.

ప్రజల మనిషిగా నియోజకవర్గంలో ప్రదీప్ రావు పేరుందని, సామాన్య ప్రజలు సైతం కుటుంబ సభ్యునిగా భావిస్తారని తెలుసుకున్నానన్నారు. అనంతరం ప్రదీప్ రావు మాట్లాడుతూ బీజేపీ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ పాలన పట్ల ప్రజలు ఆకర్శితులవుతున్నారన్నారు. ఈ సారి ఎన్నికల్లో సమిష్టిగా అందరం కలిసి తూర్పు నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేద్దామని, తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోదామని పిలుపునిచ్చారు. వివాదరహితుడినైన, ప్రజల కష్టాలు, సమస్యలు తెలిసిన నన్ను బీజేపీ అభ్యర్ధిగా గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో విజయం సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed