ప్రజా సమస్యల పరిష్కారంలో 'దిశ'ది ప్రథమ స్థానం.. వరంగల్, హన్మకొండ కలెక్టర్లు

by Javid Pasha |
ప్రజా సమస్యల పరిష్కారంలో దిశది ప్రథమ స్థానం.. వరంగల్, హన్మకొండ కలెక్టర్లు
X

దిశ, వరంగల్ బ్యూరో చీఫ్: ప్రజా సమస్యల పరిష్కారంలో 'దిశ' దిన పత్రిక ప్రథమ స్థానంలో ఉందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ గోపి, హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. శనివారం వరంగల్, హన్మకొండ కలెక్టర్ కార్యాలయాల్లో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో 'దిశ' క్యాలెండర్ ను కలెక్టర్లు డా.గోపి, రాజీవ్ గాంధీ హన్మంతు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరంగల్ కలెక్టర్ డాక్టర్ గోపి మాట్లాడుతూ.. ప్రారంభించిన అనతి కాలంలోనే దిశ పత్రిక ప్రజల మన్ననలను చూరగొందని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడూ అధికారులు, పాలకుల దృష్టికి తీసుకొస్తూ వాటి పరిష్కారానికి దిశ పాటు పడుతోందని చెప్పారు. అలాగే హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. డిజిటల్ రంగంలో దిశ దూసుకుపోతోందని అన్నారు. ఈ-పేపర్ వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.


ఇక పాలకుర్తిలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఐ విశ్వేశ్వర్ దిశ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన విషయాన్ని దిశ పత్రిక ప్రజలకు చేరుస్తోందని అన్నారు. దిశ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాల్లో దిశ వ‌రంగ‌ల్ బ్యూరో చీఫ్ ఆరెల్లి కిర‌ణ్ గౌడ్‌, ఆయా ప్రాంతాల రిపోర్టర్లు ఉన్నారు.





Next Story