బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చేర్యాల కు కోర్టు మంజూరు : ఎమ్మెల్యే పల్లా

by Kalyani |   ( Updated:2024-11-08 10:27:22.0  )
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చేర్యాల కు కోర్టు మంజూరు : ఎమ్మెల్యే పల్లా
X

దిశ, చేర్యాల: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేర్యాల ప్రాంతానికి కోర్టు మంజూరు అయిందని, సిబ్బంది కేటాయించడంలోనే ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చేర్యాల పట్టణ కేంద్రంలో కార్ వాషింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేర్యాల పాత నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కోర్టు మంజూరు చేస్తూ నిధులు కేటాయించి భవన నిర్మాణం మరమత్తులు చేయించారని, ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో కోర్టు కార్యకలాపాలు ప్రారంభం ఆలస్యం అయిందని, కోర్టు విషయం పై పలుమార్లు సీఎంవో కార్యాలయ అధికారులతో మాట్లాడానని అన్నారు.

సిబ్బందిని కేటాయిస్తూ జీవో జారీ చేయడంతో త్వరలోనే కోర్టు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని అన్నారు. అనంతరం చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పర్పాటకం ధర్మారెడ్డి గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్మన్ అంకుగారి స్వరూప శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ రాజీవ్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, డాక్టర్ గదరాజు చందు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జింకల పర్వతాలు, యూత్ నాయకులు శివగారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed