- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > వరంగల్ > ప్రశ్నిస్తే పింఛన్ కట్.. వివాదస్పదంగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తీరు!
ప్రశ్నిస్తే పింఛన్ కట్.. వివాదస్పదంగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తీరు!
by Satheesh |
X
దిశ, నర్సింహులపేట: డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు నర్సింహులపేట మండలంలో నిరసన సెగ తగిలింది. బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని గోపతండ గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతుండగా.. గోపతండకు సీఎం కేసీఆర్ ఏం చేశాడని ఓ గిరిజన మహిళ నిలదీసింది. తండాలో కనీస సౌకర్యాలు లేవని ఆ మహిళ ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన రెడ్యానాయక్ సదరు మహిళకు పెన్షన్ కట్ చేయాలని స్థానిక పంచాయతీ కార్యదర్శిని ఆదేశించాడు. దీంతో తండావాసులు ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. అభివృద్ధి పనుల గురించి ప్రశ్నిస్తే పెన్షన్ కట్ చేస్తామని బెదిరించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story