మన నియోజకవర్గంలో నీటి చుక్క రాకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం : ఎర్రబెల్లి

by Aamani |   ( Updated:2023-11-17 13:33:51.0  )
మన నియోజకవర్గంలో నీటి చుక్క రాకుండా చేసింది  కాంగ్రెస్ ప్రభుత్వం : ఎర్రబెల్లి
X

దిశ,తొర్రూరు : దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు పాలకుర్తి పార్టీ ఆఫీస్ లో దయాకర్ రావు గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం పాలకుర్తి నియోజకవర్గం వావిలాల గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.దయాకర్ రావు మాట్లాడుతూ... నాకు మంగళ హారతులతో,బతుకమ్మలతో,డోలు డప్పు వాయిద్యాలతో ఇంతటి ఘన స్వాగతం పలికి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వావిలాల గ్రామానికి వచ్చే రహదారులన్నీ ఊరి లోపల వాడ వాడ లన్ని సీసీ రోడ్లు వేయించాను అని అన్నారు.


మన నియోజకవర్గంలో నీటి చుక్కా రాకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం..అలాంటిది నేను మహారాష్ట్ర ప్రభుత్వం తో కోట్లాది జైలుకు వెళ్లినా సరే మన ఎస్ ఆర్ ఎస్ పి కాలువకు నీళ్ళు తెప్పించడం వల్ల ఈ రోజు మన గ్రామాలన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతున్నాయి.. కరెంట్ లేక ఏ రకమైన సాగు లేక పొలాలన్నీ బీడు వాలిపోయాయి అలాంటిది 24 గంటల కరెంట్ తో సాగు నీరు తెచ్చుకున్నాం..ఇంకా రైతుబంధు, దళిత బంధు,ఆసరా పెన్షన్లు,కల్యాణలక్ష్మి ఇంకా ఇలా చెప్పుకుoటుపోతే అన్ని వర్గాల అభివృద్ధి చెందే పథకాలు చాలా తీసుకొచ్చాం..మీ కష్టకాలం లో కరోనా సమయంలో మిమ్మల్ని అందుకున్నాను..కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్ ,ట్రీట్మెంట్ చేయించాను నా నియోజకవర్గ ప్రజలకు..వేల మంది మహిళలకు కుట్టు మిషన్ లో ట్రైనింగ్ ఇప్పించి సంఘం టెక్స్టైల్ పార్క్ లో ఉద్యోగాలు ఇప్పించాను,ఇంకా ఇప్పిస్తాను..యువకులకు 23 వేల డ్రైవింగ్ లైసెన్స్ లు ఇప్పించి వాళ్లకు భవిష్యత్ కోసం భీమా చేయించాము..ప్రతి గ్రామం లో 70-80 మంది చుదువుకున్న యువతి యువకులకు వారి స్కిల్స్ కి తగిన విధంగా హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇప్పించి వారికి తగిన జాబ్స్ ఇప్పిస్తాను అని తెలిపారు.

Advertisement

Next Story