- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శరవేగంగా మేడారం ఏర్పాట్లు.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
దిశ, ఏటూరునాగారం: తెలంగాణలో రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరొందింది. తాజాగా.. ఈసారి జరుగబోయే జాతర సమీపిస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం పనులు పూర్తి చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. అంతేగాక, పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను సందర్శించి, త్వరగా పూర్తి చేయాలని ఐటీడీఏ ఈఈ హేమలతకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జంపన్న వాగు వద్ద ఏర్పాటుచేసిన స్నాన ఘట్టాలను, డ్రెస్ చేంజ్ రూమ్స్ పనులను పర్యవేక్షించారు.
ఒకవైపు మేడారం మహా జాతర దగ్గరపడుతున్న తరుణంలో ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మేడారానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా రెండు డోసుల టీకాతో పాటు మాస్కు తప్పనిసరిగా వాడాలని కలెక్టర్ కృష్ణ అదిత్య భక్తులకు సూచనలు చేశారు. అంతేగాకుండా జాతర నిర్వహించే సమయంలో పరిసరాలను ఎప్పటికప్పుడు సానిటైజ్ చేయాలని ఎంపీఓకు ఆదేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి తాసీల్దార్ శ్రీనివాస్, డీఈ నవీన్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.