- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలేశ్వశ్వరానికి ప్రత్యేక బస్ సర్వీసులు.. భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి
దిశ, కాటారం : మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రసిద్ధ కాలేశ్వరం పుణ్యక్షేత్రానికిఆర్టీసీ నుండి ప్రత్యేక బస్ సర్వీసులు నడిపిస్తున్నట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనే శైవ క్షేత్రమైన కాలేశ్వరానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నందున గోదావరి నది త్రివేణి సంగమ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు హనుమకొండ, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహాదేవపూర్ నుండి కాలేశ్వరానికి ఈ నెల 16వ తేదీ రాత్రి నుండి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్ సర్వీసులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ వివరించారు. నర్సంపేట, హనుమకొండ, పరకాల, భూపాలపల్లి నుండి ప్రతిరోజు నడిచే 21 సర్వీస్ లకు అదనంగా మరొక 15 సర్వీసులు, భూపాలపల్లి నుండి 5 బస్సులను కాటారం నుండి కాలేశ్వరం కు నడిపిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించరాదని డిపో మేనేజర్ తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం తర్వాత సోమవారం అమావాస్య వస్తుండడంతో పంతులు పుణ్యస్నానాలు చేసేందుకు మహాశివుని దర్శనం కోసం 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడిపించినట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి వివరించారు. భూపాలపల్లి డిపోకు మరో రెండు సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ లో వచ్చినట్లు, త్వరలో కూకట్పల్లి నుండి మహారాష్ట్రలోని సిరంచేవరకు కొత్తగా బస్ సౌకర్యం కల్పించినట్లు డిపో మేనేజర్ తెలిపారు.