ఎస్సై వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

by Naresh |
ఎస్సై వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య
X

దిశ, హన్మకొండ టౌన్ : హసన్ పర్తి ఎస్సై దేవేందర్ వేధింపులు తాళలేక అశోక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. ఈనెల 24న దొంగతనం జరిగిందన్న అనుమానంతో ముల్కనూరుకు చెందిన గొల్లెన అశోక్ అనే యువకుడిని హసన్ పర్తి ఎస్సై దేవేందర్ పోలీస్ స్టేషన్ కు పిలిపించాడని బంధువులు తెలిపారు. చేయని దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని ఎస్సై దేవేందర్, గొల్లెన అశోక్ అనే యువకుడిని చితకబాదారని అతని బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా అశోక్ ని వరుసగా మూడు రోజులు పోలీస్ స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలు పెట్టి మరిన్ని దొంగతనాలు ఒప్పుకోవాలని హింసించారని బాధితుడు తెలిపినట్లు ఆరోపించారు.

గురువారం రోజు మళ్లీ ఉదయం రావాలని పోలీసులు సూచించినట్లు, దీంతో చిత్రహింసలకు గురైన అశోక్ మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్తే కేసులు ఒప్పుకోవాలంటూ కొడతారనే భయంతో సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించారు. అశోక్ ఆత్మహత్యకు కారణమైన హసన్ పర్తి ఎస్సైపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story