భూపాలపల్లిలో గెలుపు రాష్ట్రంలో మలుపు కావాలె : ఎమ్మెల్యే గండ్ర

by Aamani |
భూపాలపల్లిలో గెలుపు రాష్ట్రంలో మలుపు కావాలె : ఎమ్మెల్యే గండ్ర
X

దిశ,భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత సుభాష్ కాలనీలో నిర్వహించిన బహిరంగ సభలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ మధుసూదన చారిని ఉద్దేశించి నా గెలుపు మీ భుజస్కందాలపై వేసుకొని గెలిపియమని అభ్యర్థిస్తున్న గెలిపిస్తారని ఆశిస్తున్నానని మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. భూపాలపల్లి గెలుపు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు మలుపు కావాలి. ఈ భూపాలపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గండ్ర అన్నారు. ఆనాడు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే ధర్మ యుద్ధం జరగబోతుంది అర్జునుడు పూరించు శంఖారావం అని.... రామన్న పూరించేది కూడా విజయ శంఖారావమే అని ఎమ్మెల్యే గండ్ర అన్నారు.

Next Story

Most Viewed