అకాల వర్షాలతో పంటల నష్టం పై సర్వే చేయాలి.. ఎమ్మెల్యే

by Sumithra |
అకాల వర్షాలతో పంటల నష్టం పై సర్వే చేయాలి.. ఎమ్మెల్యే
X

దిశ, కాటారం : మంథని నియోజకవర్గంలో గాలి దుమారం, అకాల వర్షంతో పంటలకు జరిగిన నష్టం పై పూర్తిస్థాయిలో సర్వేచేసి రైతులకు ఆర్థిక సహాయం అందించాలని మంథని శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. విలేకరులకు శ్రీధర్ బాబు ప్రెస్ నోట్ విడుదల చేశారు. మంథని నియోజకవర్గంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని అన్ని మండలాల్లో ఈదురు గాలులు, అకాల వర్షాల కురవడం వల్ల నష్టపోయిన రైతులకు, కౌలు రైతుల పంట పొలాలకు భారీగా నీరు చేరి పాక్షికంగా నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తమ నియోజకవర్గంలోని రైతులకు జరిగిన నష్టాన్ని గుర్తించి వెంటనే సర్వేచేసి వారికి తగిన నష్టపరిహారం అందించాలని శ్రీధర్ బాబు ముఖ్యమంత్రిని కోరారు. గత సంవత్సరంలో భారీగా కురిసిన వర్షాలకు, కాళేశ్వరం బ్యాక్ వాటర్ వలన కలిగిన పంట నష్టం పై రెండు, మూడు సార్లు వ్యవసాయ అధికారులు సర్వేచేసి ప్రభుత్వానికి తెలిపిన, ఇప్పటివరకు కూడా మా ప్రాంత రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు, కాళేశ్వరం బ్యాక్ వాటర్ వలన నష్టపోతున్న రైతులకు కూడా నష్టపరిహారం పంపిణీ చేయాలని శ్రీధర్ బాబు కోరారు.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెబుతున్న కొన్ని కొనుగోలు సెంటర్స్, రైస్ మిల్లర్స్ కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి కొనుగోలు కేంద్రాలలో తడిచిన వరిధాన్యాన్ని రైతుల వద్ద వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్ల ద్వారా రైతుల ధాన్యం కొనుగోలు పై ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయలని శనివారం శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి నీ కోరారు. మంథని నియోజకవర్గం పరిధిలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, కాటారం, మహాదేవ్ పూర్, మహాముత్తారం, మల్హర్ రావు, పలిమెల మండలాల్లో ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా మారు 5 వేల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లిందని, చాలా చోట్ల వరి, ఇతర పంటలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి.

గత సంవత్సరంలో కూడా భారీగా కురిసిన వర్షాలకు మరియు కాళేశ్వరం బ్యాక్ వాటర్ వలన కలిగిన పంట నష్టం పై రెండు, మూడు సార్లు వ్యవసాయ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి చాలాసార్లు నివేదికలు తెలిపిన, ఇప్పటివరకు కూడా మా ప్రాంత రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందజేయలేదని బాబు వినతిపత్రంలో పేర్కొన్నారు. మంథని నియోజకవర్గ పరిధిలోని కొనుగోలు కేంద్రాలలో తడిచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం తెలుపుతున్నా, కొన్ని కొనుగోలు సెంటర్లు, రైస్ మిల్లర్లు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. మా నియోజకవర్గంలోని అన్ని కొనుగోలు సెంటర్ లలో తడిసిన వరిధాన్యాన్ని తేమశాతం ఉన్నా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బంది లేకుండా రైస్ మిల్లర్ల ద్వారా ఎలాంటి కటింగ్ చేయకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నష్టపైన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సీఎంను కోరారు.

Advertisement

Next Story

Most Viewed