- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Betting apps : వ్యక్తిని దొంగగా మార్చిన బెట్టింగ్ యాప్‌లు.. అరెస్ట్ చేసిన పోలీసులు..
దిశ, హనుమకొండ : బెట్టింగ్ యాప్ కారణంగా నష్టపోయి చివరికి చోరీలకు పాల్పడుతున్న దొంగను సీసీఎస్, కేయూసీ పోలీసులు సంయుక్తంగా కలిసి మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి పోలీసులు సూమారు 28 లక్షల 50 వేల రూపాయల విలువగల 334 గ్రాముల బంగారు, ఒక కిలో 640 గ్రాముల వెండి అభరణాలు, 13 వేల రూపాయల నగదు, ఒక ద్విచక్రవాహనం, ఒక సెల్‌ఫోన్, చోరీలకు ఉపయోగించే సాధనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడిస్తూ వరంగల్ జిల్లా, రాయపర్తి గ్రామానికి చెందిన కొండపల్లి ధర్మరాజు, ప్రస్తుతం హనుమకొండ, సుబేదారి, పోస్టల్ కాలనీలో నివాసం వుంటున్నాడు. నిందితుడు ధర్మరాజు డిగ్రీ పూర్తి చేసి కొద్ది కాలం రాయపర్తి మండల కేంద్రంలో బిర్యానీ సెంటర్ నిర్వహించి నష్టపోవడంతో హనుమకొండ పోస్టల్ కాలనీలో విద్యార్థినంటూ కిరాయి ఇంటిలో మకాం మార్చాడు.
నష్టపోయిన డబ్బును తిరిగి పొందేందుకు గాను నిందితుడు వివిధ మార్గాల్లో వ్యక్తిగత రుణాలు తీసుకొని అన్లైన్ బెట్టింగ్ ఆడి మరింత నష్టపోయాడు. తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించలేక పూర్తిగా అప్పులయ్యాడు. దీనితో నిందితుడు తన అప్పులను తీర్చడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించాలనుకుని దొంగతనాల మర్గాన్ని ఎంచుకొని దొంగగా మారాడు. ఇందుకోసం నిందితుడు చోరీలు చేసేందుకు సాధనాలను సమకూర్చుకోవడంతో పాటు, తన ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తూ పగటి సమయాల్లో తాళం వేసి వున్న ఇండ్లను గుర్తించి రాత్రి సమయాల్లో నిందితుడు తాళం వేసివున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడేవాడు. ఇదే రీతిలో నిందితుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 17 చోరీలకు పాల్పడగా ఇందులో కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో 8, హనుమకొండ, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో 2చొప్పున, అలాగే సుబేదారి, సంగెం, ఘన్పూర్, పాలకుర్తి, దేవరుప్పుల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీలకు పాల్పడ్డాడు. ఈ చోరీల పై అప్రమత్తమైన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు తమ వద్ద వున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోని నిందితుడిని గుర్తించడంతో పాటు అతని పై నిఘా పెట్టారు. మంగళవారం నిందితుడు తాను చోరీ చేసిన చోరీ సొత్తు అమ్మేందుకు వాహనం పై కేయూసి వైపు వస్తునట్లుగా పోలీసులకు పక్కా సమాచారం రావడంతో సీసీఎస్, కేయూసీ పోలీసులు సంయుక్తంగా కేయూ క్రాస్ వాహన తనీఖీల్లో నిందితుడు పోలీసులు పట్టుబడ్డాడు. నిందితుడిని పట్టుకొని దొంగ సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీ సలీమా, అదనపు డీసీపీ రవి, క్రైమ్ ఎసీపీ భోజ రాజు, హన్మకొండ ఎసీపీ దేవేందర్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు బాలాజీ వరప్రసాద్, రఘు, శివకుమార్, కేయూసీ ఇన్స్‌స్పెక్టర్ రవి కుమార్, ఎఎఓ సల్మాన్ పాషా, సీసీఎస్ఎ.ఎమ్ శివకుమార్ హెడ్‌కానిస్టేబుళ్లు నజీం ఆహ్మద్ జంపయ్య, కానిస్టేబుళ్లు చంద్రశేకర్, మదూకర్, రామ వెంకన్న, కేయూసీ, క్రైమ్ టీం లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందిచారు.