సెలవుల పొడిగింపు సరికాదు: డీటీఎఫ్

by Anil Sikha |
సెలవుల పొడిగింపు సరికాదు: డీటీఎఫ్
X

దిశ, హన్మకొండ టౌన్: కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించడం సరికాదని డీటీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు డి. మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. సుదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి భౌతిక తరగతులు ప్రారంభమై ఇప్పుడిప్పుడే తరగతులు, సిలబస్ గాడిన పడుతున్న నేపథ్యంలో మళ్ళీ పాఠశాలలకు సెలవులు ప్రకటించడం ద్వారా విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవుల పొడిగింపు విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా సెలవులు ప్రకటించడం సరికాదన్నారు. కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ విడతల వారిగానైనా విద్యార్థులను అనుమతిస్తూ పాఠశాలలను తెరవడం సరైనదని అన్నారు. విద్యార్థుల శ్రేయస్సు, భవిష్యత్ దృష్ట్యా పాఠశాలలను వెంటనే తెరువాలని రాష్ట ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed