'పర్యాటక ప్రాంతంగా వైజాగ్ కాలనీ'

by Sathputhe Rajesh |
పర్యాటక ప్రాంతంగా వైజాగ్ కాలనీ
X

దిశ: దేవరకొండ /నేరడిగోమ్ము : రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఓఎస్డి తిమ్మారెడ్డి అన్నారు. నేరడిగోమ్ము మండలం వైజాగ్ కాలనీ‌లో ఏడు ఎకరాల్లో గాజుబిండం ఏకో టూరిజం పార్క్ ఏర్పాటుకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో వైజాగ్ కాలనీ పర్యాటక ప్రాంతంగా మారనున్నదని ఆయన అన్నారు. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్‌ల సహకారంతో ఎకో టూరిజం అభివృద్ధి పనులకు ముందడుగు వేసినట్లు ఆయన తెలిపారు. వైజాగ్ కాలనీలో పర్యాటకులు అహ్లదకరమైన ప్రదేశాన్ని చూడబోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాయని సుధీర్ రెడ్డి, టీవీ ఎన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ దూడ బావోజి, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed