- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గోషామహల్ టికెట్‌కు విక్రమ్ గౌడ్ దరఖాస్తు.. ప్రశ్నార్థకంగా మారిన రాజాసింగ్ పొలిటికల్ కెరీర్..!

X
దిశ, తెలంగాణ బ్యూరో: దివంగత మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ గోషామహల్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డికి ఆయన ఒక కాపీని అందజేశారు. ఇదిలా ఉండగా గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు సస్పెన్షన్ ఎత్తివేయలేదు. ఎత్తివేస్తారా.. లేదా అనే క్లారిటీ కూడా లేదు. కానీ రాజాసింగ్ మాత్రం బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని ఇటీవల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో గోషామహల్ సీటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Next Story