గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5శాతం రిజ్వేషన్స్ అమలు చేయాలి.. వికలాంగుల పరిరక్షణ సమితి

by Javid Pasha |
గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5శాతం రిజ్వేషన్స్ అమలు చేయాలి.. వికలాంగుల పరిరక్షణ సమితి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయాలని వికలాంగుల పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు వెల్ఫేర్​ మినిస్టర్​ కొప్పుల ఈశ్వర్​కు ప్రత్యేక వినతి పత్రం అందజేశారు. సొంత స్థలం కలిగిన నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విధితమే. దీనిలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్​ అమలు చేయాలని నిర్ణయించింది. అయితే దీంతో పాటు వికలాంగుల 5 శాతం అమలు చేయాలని వికలాంగుల రక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed