- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రదీప్ మరణం: కిషన్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే హైదరాబాద్ అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ మృతి చెందాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కుక్కల దాడిలో ప్రదీప్ చనిపోవడం బాధ కలిగించిందన్నారు. సోమవారం ప్రదీప్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. మృతి చెందిన బాలుడి అక్క చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బాధ పడుతున్న కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదీప్ కుటుంబానికి ఆర్థిక సాయం పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నగర బస్తీల్లో పేద పిల్లలు ఎక్కువగా రోడ్లపైనే ఆడుకుంటుంటారని అందువల్ల కుక్కలు ఎక్కువగా బస్తీల్లోనే మకాం వేసి దాడులు చేస్తున్నాయన్నారు. వీధి కుక్కల సమస్యను వెంటనే పరిష్కరించి హైదరాబాద్ ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు. వీధి కుక్కల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయిస్తారో చెప్పాలన్నారు.