అభ్యర్థి ఎవరైనా.. సికింద్రాబాద్‌లో గెలుపు నాదే: కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Satheesh |
అభ్యర్థి ఎవరైనా.. సికింద్రాబాద్‌లో గెలుపు నాదే: కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌ పార్లమెంట్‌లో గెలుపుపై కేంద్రమంత్రి, టీ-బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థి ఎవరైనా సికింద్రాబాద్ పార్లమెంట్‌లో గెలుపు నాదేనని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల ప్రచారంపైన మా దృష్టి ఉందని.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థి ఎవరనే భయం మాకు లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో సికింద్రాబాద్ సహా అన్ని లోక్ సభ స్థానాల్లో గెలుపు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదని అన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనే బీజేపీకి పోటీ అని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డికే.. బీజేపీ హై కమాండ్ మరోసారి టికెట్ ఇచ్చింది. దీంతో మరోసారి బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.

మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సైతం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. గ్రేటర్‌లో మంచి పట్టున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకుని మరీ అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వగా.. హైదరాబాద్‌లో మాస్ లీడర్‌గా పేరున్న సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ రంగంలోకి దింపుతోంది. ముగ్గురు బలమైన నేతలు పోటీ పడుతుండటంతో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. మరీ సికింద్రాబాద్ ఎంపీగా ఎవరో గెలుస్తారా చూడాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed