- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రెస్ క్లబ్‌కా.. ఫామ్ హౌస్‌కా.. ఎక్కడికి రమ్మన్నా వస్తా: కేసీఆర్‌కి మంత్రి కిషన్ రెడ్డి సవాల్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కేంద్రం ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియతో మాట్లాడుతూ.. కేంద్రంపై బురద జల్లేందుకే కేసీఆర్ అసెంబ్లీని వాడుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ అవగాహన లేకుండా కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు. అసెంబ్లీలో దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన కేసీఆర్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు అంత ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రగతిపై సభలో ఎందుకు చర్చించలేదన్నారు. కుటుంబ పాలనపై, ధరణి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఎందుకు చర్చ జరగలేదని నిలదీశారు.
తెలంగాణలో కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారనే విషయం కేసీఆర్‌కి అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు. మంత్రులు సభలో సీఎం కేసీఆర్‌కు భజన చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. సభలో మంత్రులు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నా.. భారత ఆర్థిక పరిస్థితిపై చర్చకు కేసీఆర్ ఎక్కడికి రమ్మన్నా వస్తా.. ప్రెస్ క్లబ్‌కి రమ్మంటారా.. లేదా మీ ఫామ్ హౌజ్‌కు రమ్మంటారా లేదా ప్రగతి భవన్‌కు రమ్మంటారా అని ఛాలెంజ్ చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుంటే గూగుల్ సెర్చ్ చేయండని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి: అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు