- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మో మా వల్ల కాదు బాబోయ్.. పందెం కోడిని మేపలేక వేలానికి డేట్ ఫిక్స్
by Shiva |
X
దిశ, డైనమిక్ బ్యూరో : కరీంనగర్ డిపో అధికారులకు కొత్త చిక్కు వచ్చిపడింది. నెల 9న ఓ ప్రయాణికుడు బస్సులోనే పందెం కోడిని పొరపాటున వదిలి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే, కండక్టర్ ఆ కోడిని డిపోలో అప్పగించగా.. అక్కడున్న యాజమాన్యం దానికి ప్రత్యేకంగా జాలి ఏర్పాటు చేసి దాణా, నీళ్లు పెడుతూ దాని బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కోడి సంరక్షణ తమ వల్ల కాదంటూ డిపో వాళ్లు చేతులెత్తేశారు. గత మూడు రోజులుగా కోడిని తీసుకెళ్లేందుకు ఎవరూ రాలేదని, కావున ఆ పందెం కోడిని అంబేద్కర్ బస్ స్టేషన్ ఆవరణలో కరీంనగర్-2 డిపో పరిధిలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు డిపో మెనేజర్ పేర్కొన్నారు. కావున, ఆసక్తి గలవారు బహిరంగ వేలంలో పాల్గొని కోడిని దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది.
Advertisement
Next Story