TSPSC పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

by GSrikanth |
TSPSC పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 21కి చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నపత్రాలను కంప్యూటర్ నుంచి తస్కరించిన ప్రధాన నిందితుడు, బోర్డు ఉద్యోగి ప్రవీణ్ కుమార్ 10 లక్షల రూపాయలకు గురుకుల టీచర్ రేణుకకు అమ్మిన విషయం తెలిసిందే. రేణుక వీటిని తన భర్త లద్యావత్ డాక్యా నాయక్‌కు ఇచ్చింది. వీటిని డాక్యా తెలిసిన వారి ద్వారా విక్రయించాడు. ఈ క్రమంలోనే భగవంత్ కుమార్ అనే వ్యక్తి తన తమ్ముడు రవికుమార్ కోసం ఈ ప్రశ్నపత్రాలను రెండు లక్షలకు కొన్నాడు. డాక్యా నాయక్ బ్యాంక్ అకౌంట్ ను పరిశీలించినపుడు భగవంత్ కుమార్ నుంచి 1.75 లక్షలు డాక్యా నాయక్ అకౌంట్ లో డిపాజిట్ అయినట్టు గుర్తించిన సిట్ అధికారులు అన్నదమ్ములు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్లు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది.

Advertisement

Next Story