- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ ఖమ్మం సభలో కనిపించని ఆ ఇద్దరు!
దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో ప్రబలమైన మార్పుకు శ్రీకారం చుట్టాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో నేషనల్ పాలిటిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఖమ్మం సభను ఓ మైల్ స్టోన్ గా మార్చాలని నిర్ణయించారు. దేశ రాజకీయాల్లో మార్పుకు ఖమ్మం సభ ద్వారా అంకురార్పణ చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్న వేళ.. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు జాతీయ స్థాయి నేతలు ఈ సభకు వచ్చిన నేపథ్యంలో అందరి ఫోకస్ ఖమ్మం సభపైనే ఉంది. దేశంలో మోడీ హావాను నిలువరించాలంటే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ అవసరం ఉందని చెబుతున్న కేసీఆర్.. స్వతంత్ర భారతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని సర్వనాశనం పట్టించాలని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలంటే సమిష్టిగా కేంద్రంలోని బీజేపీని ఢీ కొట్టాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు.
పలువురు జాతీయ స్థాయి నేతలతో, ప్రముఖ ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం అయి తన రాజకీయ ఆలోచనలను పంచుకుంటున్నారు. గతంలోనే అనేక సార్లు వివిధ రాష్ట్రాల నేతలతో సమావేశం అయిన కేసీఆర్ తాజాగా ఖమ్మం సభకు సైతం వారిని ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించిన ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ నేత డి.రాజాలు ఖమ్మం సభకు హాజరై బీజేపీపై పోరాటానికి పిలుపునిచ్చారు. అయితే ఈ సభలో వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యనేతలు హాజరైనప్పటికీ కేసీఆర్ కు మొదటి నుంచి అన్ని సందర్భాల్లో సపోర్ట్ గా ఉంటున్న కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమార స్వామి కనిపించకపోవడం సర్వత్రా హాట్ టాపిక్ అయింది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టిన నాటి నుంచి కీలకమైన ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ పక్కన కుమార స్వామి ఉన్నారు. పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా తీర్మానం చేసినప్పుడు, అధికారికంగా ఈసీ నుంచి వచ్చిన లెటర్ పై కేసీఆర్ సంతకం చేసినప్పుడు, ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమ సమయంలోనూ కుమారస్వామి వచ్చారు. కానీ ముఖ్యమైనదిగా భావిస్తున్న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మాత్రం ఆయన ఎక్కడా కనిపించలేదు. కనీసం తన తరపున ప్రతినిధుల బృందాన్ని కూడా పంపలేదు. దీంతో ఇన్నాళ్లు సపోర్ట్ గా నిలిచిన కుమార స్వామి ఖమ్మం సభకు ఎందుకు రాలేదనే చర్చ ఇటు పార్టీ వర్గాల్లో అటు ప్రతిపక్షాల్లోనూ చర్చగా మారింది.
కుమార స్వామితో పాటు మరో కీలక వ్యక్తి ప్రకాష్ రాజ్ కూడా ఖమ్మం సభలో కనిపించలేదు. ఇటీవల ప్రకాష్ రాజ్ కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటున్నాడు. పలు కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాడు. గతంలో పీకేతో కలిసి కాళేశ్వరం పనులను ఆయన పరిశీలించిన ప్రకాశ్ రాజ్ బహిరంగానే కేసీఆర్, కేటీఆర్ పాలసీలను ప్రశంసిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ పత్రాలపై సంతకాలు పెట్టే కార్యక్రమంలో కుమారస్వామితో పాటు ప్రకాష్ రాజ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో బీఆర్ఎస్ కర్ణాటక బాధ్యతలు ప్రకాశ్ రాజ్ కు అప్పగించబోతున్నారనే టాక్ వినిపించింది. అలాంటి ప్రకాష్ రాజ్ కూడా ఖమ్మం సభలో కనిపించకపోవడంతో ఏం జరిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఖమ్మం సభ స్టేజీ జాతీయ నేతలతో కలకలలాడినా కేసీఆర్ కు మిత్రులుగా చెప్పబడే కుమార స్వామి, ప్రకాశ్ రాజ్ లు కనిపించకపోవడంతో కొంత వెలతి కనిపించింది. కాగా కుమార స్వామి ఆబ్సెంట్ పై కుమారస్వామి తనయుడు, జేడీఎస్ నేత నిఖిల్ గౌడ స్పందించారు. ఇతర పనుల కారణంగా ఖమ్మం సభకు హాజరు కాలేకపోతున్నామని తర్వాత బీఆర్ఎస్ సభలో తప్పకుండా హాజరవుతామని చెప్పారు.