ఏపీ సీఎంతో చర్చించి తిరుమల కొండపై రెండు నిర్మాణాలు.. CM రేవంత్ రెడ్డి

by Rajesh |
ఏపీ సీఎంతో చర్చించి తిరుమల కొండపై రెండు నిర్మాణాలు.. CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎంతో చర్చించి తెలంగాణ ప్రభుత్వం తరఫున తిరుమల కొండపై సత్రం, కల్యాణ మండపం నిర్మిస్తామన్నారు. తద్వారా తెలంగాణ నుంచి వచ్చే భక్తులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. అంతకుముందు తన మనవడి పుట్టువెంట్రుకల కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఏపీతో సత్సంబంధాలు కొనసాగిస్తామని పరస్పర సహకారంతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. ఇక మీడియాతో మాట్లాడి వస్తున్న సమయంలో సీఎం రేవంత్ అక్కడ ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తన మనవడిని నడిపిస్తూ ఆలయ ప్రాంగణంలో సరదాగా గడిపారు.


Advertisement

Next Story

Most Viewed