ఇద్దరు అన్నదమ్ముల మర్డర్ కేసు : నిజామాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు

by Sathputhe Rajesh |
ఇద్దరు అన్నదమ్ముల మర్డర్ కేసు : నిజామాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్‌‌ : నిజామాబాద్ నగరంలోని రైల్వే గ్రౌండ్ వద్ద జరిగిన జంట హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సునీత కుంచాల తీర్పు ఇచ్చారు. నగరంలోని ఆదర్శనగర్ చెందిన బద్రి పవన్ కళ్యాణ్, బద్రి నర్సింగ్ యాదవ్ అనే అన్నదమ్ములను, నగరంలోని హమాల్ వాడికి చెందిన మొగుళ్ల సాయిప్రసాద్ ఆలియాస్ తల్వార్ సాయి, మొగుళ్ళ మహేందర్, దాత్రిక సంజయ్ లు క్రికెట్ బ్యాట్లతో కొట్టి తల్వార్లతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

2018 జూలై 21న ఈ హత్య కేసులో నిజామాబాద్ మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. అందరి యువకుల మధ్య ఆధిపత్య ధోరణిలో జరిగిన గొడవ, సవాల్ ల అన్నదమ్ములిద్దరూ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం న్యాయస్థానంలో ఈ కేసులో సాక్షాదారాలను పరిశీలించి జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సునీత కుంచాల ముగ్గురు నిందితులకు హత్య, హత్యాయత్నం కేసులలో జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు వెలువరించారు. నిజామాబాద్ నగరంలో సంచలనం రేపిన జంట హత్య కేసులో తీర్పు వెలువడటం తో న్యాయం జరిగిందని నగరంలో చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed