- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచన
by Sathputhe Rajesh |

X
దిశ, డైనమిక్ బ్యూరో: విద్యార్థుల ఆత్మహత్యలపై టీస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. విద్యార్థులకు మార్కులే జీవితం కాదని సూచించారు. పరీక్షల్లో తప్పితే క్షణికావేశం పనికిరాదని, ఒక్క విద్యా సంవత్సరం వృథా అయితే మీ జీవితం అంతటితో ఆగిపోదన్నారు. మళ్లీ పాస్ కావడానికి అవకాశాలుంటాయని, లేకుంటే మరెన్నో ప్రత్యామ్నాయ మార్గాలుంటాయని తెలిపారు. ఎదురొడ్డితేనే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరతామనే విషయం విద్యార్థులు మరిచిపోవద్దని సూచించారు. పరీక్షల్లో తప్పామని బలవన్మరణాలకు పాల్పడి మీ తల్లిదండ్రులకు తీరని వేదనను మిగల్చకండి అంటూ ట్వీట్ చేశారు.
Next Story