భారీ గుడ్‌న్యూస్ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ.. వారికి మాత్రమే వర్తించనుందా!

by Hamsa |   ( Updated:2023-12-23 05:30:54.0  )
భారీ గుడ్‌న్యూస్ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ.. వారికి మాత్రమే వర్తించనుందా!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన రెండు రోజులకే రెండు గ్యారంటీల్లో భాగంగా ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ సర్వీసుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా ఉంటోంది. మహిళలు మహాలక్ష్మి పథకాన్ని విచ్చల విడిగా వాడేస్తున్నారు. కొందరు అవసరానికి వాడితే మరికొంతమంది నిరుపయోగంగా వాడుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో ఎక్కువ మంది మహిళలు ఉంటున్నారు. ఉచిత ప్రయాణం పథకం అందుబాటులోకి తీసుకువచ్చిన కానుండి బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు, ట్రిప్పులు నడపాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

ఈ క్రమంలో డ్రైవర్లు, కండక్టర్లు డబుల్‌ డ్యూటీ చేయాల్సి వస్తోంది. తాజాగా, ఆర్టీసీ సంస్థ డ్రైవర్లు, కండక్టర్లకు భారీ శుభవార్త తెలిపింది. ఇక నుంచి డబుల్ డ్యూటీ చేసేవారికి ఇన్సెంటివ్ పెంచుతున్నట్లు వెల్లడించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో డ్రైవర్లకు రూ.900కు పెంచారు. కండక్టర్లకు రూ.700 నుంచి రూ.850కి, కాంట్రాక్ట్‌ డ్రైవర్లకు రూ.720కి, కాంట్రాక్ట్‌ కండక్టర్లకు రూ.620కి పెంచారు. ఇక రాష్ట్రంలోని ఇతర రీజియన్ల- డ్రైవర్లకు రూ.730కి, కండక్టర్లకు రూ.650. కాంట్రాక్ట్‌ డ్రైవర్లకు రూ.590, కాంట్రాక్ట్‌ కండక్టర్లకు రూ.510కి ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇది కేవలం డబుల్ డ్యూటీ చేసేవారికి వర్తించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed