- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC: ముగింపు దశకు చేరుకున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసు!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ విచారణ ముగింపు దశకు చేరుకుంది. వారం రోజుల్లో సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు. కాగా, ప్రశ్నపత్రాల లీకేజీపై ఎఫ్ఐఆర్ జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం నుంచి విచారణ ప్రారంభించనున్నారు.
దర్యాప్తు సాగింది ఇలా..
బిల్డింగ్టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకైనట్టుగా అనుమానాలు రావడంతో గత నెల 11న టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టి ఏఈఈ సివిల్, జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాలు లీకైనట్లు నిర్ధారించారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రాంచంద్రన్ పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ ఔట్‌సోర్సింగ్‌పై డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డితో కలిసి ప్రశ్నపత్రాలను తస్కరించినట్టుగా వెల్లడైంది. కాన్ఫిడెన్షియల్రూం ఇన్‌ర్జిగా ఉన్న శంకర్లక్ష్మి డైరీ నుంచి కంప్యూటర్‌కు సంబంధించిన పాస్వర్డులు, ఐపీ అడ్రస్‌లు తీసుకున్నట్లు స్పష్టమైంది. రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకున్నాడు. వీటిని గురుకుల టీచర్ రేణుకకు పది లక్షల రూపాయలకు ఇచ్చాడు. దీంతో పోలీసులు రేణుకతోపాటు ఆమె భర్త లద్యావత్ డాక్యాను అరెస్టు చేశారు. ప్రశాంత్, రాజశేఖర్‌రెడ్డి, రేణుక, డాక్యాలతోపాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు ప్రశ్నపత్రాలు కొన్నవారు ఉన్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం కూడా...
అరెస్టు చేసిన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను విచారించగా ఇద్దరూ కలిసి గత సంవత్సరం అక్టోబరులో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని సైతం తస్కరించినట్టుగా నిర్ధారణైంది. దీంతో ఈ పరీక్షతోపాటు నిర్వహించాల్సి ఉన్న మరికొన్ని పరీక్షలను రద్దు చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్పరీక్ష ప్రశ్నపత్రం ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, బోర్డు ఉద్యోగులైన షమీమ్, రమేశ్‌తోపాటు మాజీ ఉద్యోగి సురేశ్‌కు మాత్రమే అందినట్టుగా సిట్ విచారణలో నిర్ధారణ అయ్యింది. న్యూజీలాండ్‌లో ఉంటున్న రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌రెడ్డి ఇక్కడికి వచ్చి గ్రూప్-1 ప్రిలిమ్స్పరీక్ష రాసినట్టుగా తేలింది. ఈ అయిదుగురికి తప్పితే ఈ ప్రశ్నపత్రం బయటివారెవ్వరికీ లీక్కాలేదని స్పష్టమైంది. బోర్డు సెక్రటరీ అనితా రామచంద్రన్, లింగారెడ్డి నుంచి పలు వివరాలు సేకరించారు. దీంతో లీకేజీ కేసులో విచారణ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. అన్ని అంశాలతో నివేదికను రూపొందించి సీల్డ్కవర్లో న్యాయస్థానానికి సమర్పించనున్నారు.
రంగంలోకి ఈడీ
టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో పెద్దమొత్తాల్లో డబ్బులు చేతులు మారినట్టుగా ముందు నుంచి అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. ఇదే విషయాన్ని పేర్కొంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల ఈడీ అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం ఈడీ అధికారులు ప్రశ్నపత్రాల లీకేజీపై ఎఫ్ఐఆర్ జారీ చేశారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో విచారణను ఇంకా ప్రారంభం కాలేదు. సోమవారం సిట్ కార్యాలయానికి వెళ్లి ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో వెల్లడైన వివరాలను ఈడీ అధికారులు తీసుకోనున్నారు. సిట్‌తో సంబంధం లేకుండా ఈడీ దర్యాప్తు వేరుగా జరగనుంది. ఈడీ సేకరించిన వివరాలు సైతం కోర్టుకు సమర్పించనున్నారు.
Also Read..