- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా

దిశ, శంషాబాద్ : అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని జిహెచ్ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవుపల్లి డివిజన్ కాటేదాన్ లోని సర్వేనెంబర్ 186 నుంచి 178 ఎలాంటి అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు షెడ్లు నిర్మించారని ఫిర్యాదు రావడంతో రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో మంగళవారం టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ జిహెచ్ఎంసి సిబ్బందితో వెళ్లి మూడు జెసిబి లతో భారీ పోలీసు బందోబస్తు మధ్య 5 అక్రమ నిర్మాణాల షెడ్లను పూర్తిగా నేలమట్టం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి అనుమతి లేకుండా ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాటేదాన్ లో అనుమతి లేకుండా షెడ్ల నిర్మాణం చేపట్టారని, గతంలో ఫిర్యాదు రావడంతో నోటీసులు ఇవ్వడం జరిగింది అయినా అక్రమ నిర్మాణదారులు నోటీసులకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో షెడ్లను పూర్తిగా కూల్చి వేయడం జరిగిందన్నారు. అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి నష్టపోవద్దని, నిర్మాణం చేపట్టాలంటే జిహెచ్ఎంసి నుండి అనుమతి తీసుకొని నిర్మించుకోవాలన్నారు. కూల్చివేసిన ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.