నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 581 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ​విడుదల

by Satheesh |   ( Updated:2022-12-23 14:40:10.0  )
నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 581 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ​విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. సంక్షేమ హాస్టళ్లలో ఉద్యోగాల భర్తీ కోసం స్వరాష్ట్రంలో ఇదే తొలి నోటిఫికేషన్. మొత్తం 581 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో వార్డెన్లు, గ్రేడ్​టూ వార్డెన్లు, మ్యాట్రన్ల పోస్టులున్నాయి. జనవరి 6 నుంచి 27 వరకు ఆన్​లైన్‌లో అప్లికేషన్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

Advertisement

Next Story