- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బిగ్ బ్రేకింగ్: అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షపై TSPSC సంచలన నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: పేపర్ లీక్ ఘటనతో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ (AE) పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ప్రకటించింది. అయితే, ఈ నెల 13వ తేదీన జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం వెలుగు చూడటంతో.. ఏఈ పరీక్ష పేపర్ కూడా లీక్ అయినట్లు అనుమానించిన టీఎస్పీఎస్సీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బోర్డు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై విచారణ చేపట్టి అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్ష పేపర్ కూడా లీక్ అయినట్లు గుర్తించారు. పరీక్షకు రెండు రోజుల ముందే ఏఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఏఈ పరీక్షను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నెల 5వ తేదీన వివిధ విభాగాల్లో 837 పోస్టుల భర్తీకి జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షను 55 వేల మంది రాశారు.