- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేజ్రీ ఆ చిన్న లాజిక్ మిస్సయ్యారా? ఆప్ ఓటమికి కారణాలు చెప్పిన టీపీసీసీ చీఫ్

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఆప్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయని, కేజ్రీవాల్ పతనానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి.. కేసీఆర్ సారథ్యంలోని (BRS) బీఆర్ఎస్ పార్టీతో కేజ్రీవాల్ స్నేహం ఆయన కొంప ముంచిందనే చెప్పాలని విమర్శించారు. (KCR) కేసీఆర్ కుమార్తె కవితతో కేజ్రీ అండ్ కో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు ఆయన పతనానికి పునాదులు వేశాయన్నారు. ఏ అవినీతిరహిత నినాదంతో కేజ్రీవాల్ దేశ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారో దానికి లిక్కర్ స్కామ్ తూట్లు పొడిచిందని ఆరోపించారు. ఆప్‌కు అప్పటి వరకు ఉన్న క్లీన్ ఇమేజ్‌ను లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఊడ్చిపారేశాయని తెలిపారు. అవినీతికి కేజ్రీవాల్ అతీతుడు కాదు అన్న అభిప్రాయం ప్రజల్లో కలగడానికి కేసీఆర్ ఫ్యామిలీ కారణమైందన్నారు. రెండు దఫాలు (Delhi) ఢిల్లీని ఏలిన కేజ్రీ పాలనలో లిక్కర్ స్కామ్ తప్ప మరో అవినీతి ఆరోపణ లేదన్నారు. (MLC Kavitha) కవిత లిక్కర్ వ్యాపార కాంక్ష కేజ్రీ పార్టీ సిద్ధాంతానికే తూట్లు పొడిచిందని తెలిపారు.
ఇక రెండో అంశం.. కాంగ్రెస్ పార్టీని శత్రువుగా పరిగణించడం తాజా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీ పతనానికి మరో కారణమన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు వద్దు అన్న ఆయన నిర్ణయం బీజేపీ నెత్తిన పాలు పోసిందనే చెప్పాలని వెల్లడించారు. కాంగ్రెస్‌తో కటీఫ్ నిర్ణయంలో హేతుబద్ధత లేదన్నారు. కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేస్తే బీజేపీ వ్యతిరేక ఓటు చీలి కాషాయ పార్టీకి మేలు జరుగుతుందన్న చిన్న లాజిక్‌ను కేజ్రీవాల్ తెలిసి మిస్సయ్యారా.. లేక ‘అవగాహన’తో చేశారా అన్నది అర్థం కాని విషయమని వివరించారు. కవిత (Liquor scam) లిక్కర్ స్కామ్‌తో పార్టీ కోర్ ఐడియాలజీనే దెబ్బతీసుకున్న (Arvind Kejriwal) కేజ్రీవాల్.. కాంగ్రెస్‌ను దూరం పెట్టి అధికారాన్ని కూడా కోల్పోయారని చెప్పక తప్పదని వెల్లడించారు.