TPCC chief: వారి అభిప్రాయం మేరకే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక.. చిట్ చాట్ లో మహేశ్ కుమార్ గౌడ్

by Prasad Jukanti |
TPCC chief: వారి అభిప్రాయం మేరకే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక.. చిట్ చాట్ లో మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రిజర్వేషన్ల పెంపు తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. అధికార యంత్రాంగం వల్ల పథకాలు కొంత క్షేత్రస్థాయిలోకి వెళ్లడం తాము బీఆర్ఎస్ (BRS) మాదిరిగా అబద్దాలు చెప్పి చేతులు ఎత్తెయడం లేదన్నారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేల అభిప్రాయ ప్రకారం ఉంటుందన్నారు. అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ఇప్పటికే ఏఐసీసీకి పంపించామని అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. అభ్యర్థుల ఎంపికపై వచ్చే నెల 3న సమావేశం నిర్వహిస్తామన్నారు. కుల సర్వే జరిగితే తమకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేశాయి కానీ కులగణన సంపూర్ణంగా పూర్తయిందన్నారు. కులగణన రిపోర్టు పై ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన నివాసం లేదా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారన్న విమర్శలను మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. సమయాన్ని బట్టి సీఎం ఇంటి దగ్గర సమీక్ష చేస్తారు అందులో తప్పేముందని ప్రశ్నించారు. సచివాలయం కూల్చి మళ్లీ కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ (CONGRESS) సోషల్ మీడియాపై ఈ సందర్భంగా పీసీసీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మా సోషల్ మీడియా టీమ్ కొంత వీక్ ఉంది.. స్త్రెంథెన్ చేస్తామన్నారు. జనాలు ఎవరు ఫాం హౌజ్ పాలన కోరుకోరని, మానుప్యూలెట్ సర్వే లు జరుగుతున్నాయన్నారు.

వచ్చే నెలలో రాష్ట్రానికి రాహుల్ గాంధీ:

ఫిబ్రవరి రెండో వారంలో సూర్యాపేట జిల్లాలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) సభ నిర్వహించబోతున్నామని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పటాన్ చెరు కాంగ్రెస్ వివాదంపై కమిటీ నివేదిక ఇంకా రాలేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కమిటీ ముందుకు రావాల్సి ఉందన్నారు. సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారం అవుతుందని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ జాతీయ నాయకులు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకుంటే బాగుటుందన్నారు. కేసీఆర్ నీ ఉద్యమకారుడిగా గౌర విస్తారు..అభిమానిస్తారు. వైఎస్ ఆర్ కు కూడా అపారమైన అభిమానులు ఉన్నారన్నారు. మావోయిస్ట్ లు జనజీవన స్రవంతిలో కలవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుందిని, నక్సలైట్ ప్రజా క్షేత్రం లో కి రావాలని పిలుపునిచ్చారు.

నాయా పైసా తేని ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు:

త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ జీహెచ్ఎంసీ (GHMC) మీటింగ్ కు బీజేపీ సభ్యులు బిక్షాటన చేస్తూ వచ్చారు. కానీ కేంద్రం నుంచి హైదరాబాద్ కు నయా పైసా తీసుకురాని ఇద్దరు కేంద్ర మంత్రులు మన రాష్ట్రంలో ఉన్నారని విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. సంవత్సర కాలంగా మా ప్రభుత్వ ఫలాలు అందరికీ అందుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో చాలా మంది మేధావులు ఉంటారు. మెట్రో విస్తరణ పనులు, ఫోర్త్ సిటీ, హైడ్రా,మూసి ప్రక్షాళనతో మాకు పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోలేదన్నారు.

Next Story

Most Viewed