- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు.. టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో రథసప్తమి వేడకలు అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ (TTD) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) వెల్లడించారు. ఇవాళ అన్నమయ్య భవన్‌లో ధర్మకర్తల మండలి సమావేశాన్ని నిర్వహించారు. మీటింగ్‌లో పాల్గొన్న అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) మాట్లాడుతూ.. రథసప్తమి ( ) రోజు పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. సిఫారసు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తునన్నట్లుగా ప్రకటించారు. నేరుగా వచ్చే భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల ద్వారా దర్శనానికి అనుమతిస్తామని వివరించారు. మాడ వీధుల్లో వాహన సేవల దర్శనాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. మాడ వీధుల్లో భక్తులకు ఎండ, చలి నుంచి రక్షణ కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 8 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉన్నాయని బీఆర్ నాయుడు అన్నాడు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex) లోని 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు దర్శనానికి 8 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అదేవిధంగా టైమ్ స్లాట్ (Time Slot) దర్శనం టోకెన్ తీసుకున్న వారికి 4 గంటల సమయం పడుతుంది. ఇక రూ.300ల స్పెషల్ దర్శనానికి 2 నుంచి 3 గంటల టైం జడుతోంది. గురువారం శ్రీవారిని 51,349 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 14,082 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గురువారం రూ.3.65 కోట్లు వచ్చాయని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.