- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TSPSC పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన సిట్
by Satheesh |

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు సోమవారం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయినవారి సంఖ్య 24కి చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బోర్డు ఉద్యోగి ప్రవీణ్ కుమార్ బ్యాంక్ అకౌంట్లను సిట్ అధికారులు విశ్లేశించినపుడు కొన్ని అనుమానాస్పద లావాదేవీలు దృష్టికి వచ్చాయి. ఈ దిశలో దర్యాప్తు చేసిన సిట్ అధికారులు తాజాగా మురళీధర్ రెడ్డి, మనోజ్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా ప్రవీణ్ కుమార్ ఒక్కొక్కరి నుంచి పది లక్షల రూపాయలు తీసుకొని ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పరీక్ష ప్రశ్నపత్రాలు అమ్మినట్టుగా వెళ్లడయ్యింది. వీరితోపాటు మరో ముగ్గురికి కూడా ప్రవీణ్ కుమార్ ప్రశ్నపత్రాలు అమ్మినట్టు దర్యాప్తులో తేలింది. వీరి కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు.
Next Story