- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Akbaruddin Owaisi : సభలో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగాలి : అక్బరుద్దీన్ ఓవైసీ

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్(MLA Jagadish Reddy Suspension) పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi) స్పందించారు. అసెంబ్లీ(Telangana Assembly)లో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేసిన తప్పులు చేయకూడదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు. కొందరు నేతలు మంచిగా పనిచేస్తారు, కొందరు సరిగా పనిచేయరు, మరి కొందరు తప్పులు చేస్తారని.. వాటిని పరిష్కరించుకుంటూ వెళ్లాలని పేర్కొన్నారు. సభలో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరగాలి గాని ఇష్టానుసారంగా కాదన్నారు. 15 నిముషాలు అన్నారు.. నాలుగు గంటలపాటు సభను వాయిదా వేశారని, సభ ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం ఎవరికీ తెలియదని అసహనం వ్యక్తం చేశారు. సభ్యుడి సస్పెన్షన్ అంశంపై మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, సభ్యుడు సరిగా మాట్లాడారా? లేదా? అనేదానిపై మా అభిప్రాయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. మరోసారైనా అందరు ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాలు తీసుకోవాలని కోరుతున్నానని అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు.