- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘కంటి వెలుగు’ పని సరే.. పైసలేవీ?
దిశ, తెలంగాణ బ్యూరో: అంధత్వ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కంటి వెలుగు స్కీమ్‌పై మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే సర్కార్మాత్రం ఆ లోపాలను సవరించకుండానే ముందుకు సాగుతోంది. దీంతో ప్రజలతో పాటు కంటి వెలుగు స్టాఫ్ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంటి వెలుగు క్యాంపులు నిర్వహిస్తున్న స్టాఫ్‌కు సకాలంలో వేతనాలు అందడం లేదు.
రెండు నెలలు జీతాలు రావాల్సి ఉన్నదని స్టాఫ్పేర్కొంటున్నారు. ‘తమతో పనిచేయించుకుంటూ.. పైసలు ఇవ్వకపోవడం ఏమిటని పీఎంవో (అప్టోమెట్రిస్ట్), డీఈవో(డేటా ఎంట్రీ ఆపరేటర్స్) ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఆఫీసర్ల నుంచి సరైన రెస్పాండ్లేకపోవడంతో జీతాలు వస్తాయా? లేదా? అని కంటి వెలుగు స్టాఫ్ఆందోళన వ్యక్తం చేశారు.
టెస్టింగ్ మిషన్ల రెంట్ల పరిస్థితి అంతే..
కంటి వెలుగు క్యాంపుల్లో పరీక్షల చేసేందుకు ఆధునాతన టెక్నాలజీతో కూడిన ఏఆర్మిషన్లను ప్రభుత్వం కొన్ని సంస్థల నుంచి లీజుకు తీసుకున్నట్లు తెలిసింది. ఒక్కో మిషన్‌ను రూ.25 వేలు చొప్పున రెంట్‌కు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయా సంస్థలకు డబ్బులు చెల్లించలేదు. వైద్యశాఖ ఉన్నతాధికారులను సంప్రదించినా, ప్రభుత్వం నుంచి ఇంకా బడ్జెట్ రాలేదని చెబుతున్నారని మిషన్లను లీజుకు ఇచ్చిన సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కంటి వెలుగు క్యాంపుల కోసం అద్దెకు తీసుకున్న వాహనాలకూ కిరాయిలు ఇవ్వలేదని స్వయంగా క్యాంపుల ఇన్‌చార్జిలు చెబుతున్నారు.
అద్దాలకు ఆగం..
కంటి వెలుగు స్కీమ్‌లో ఇప్పటి వరకు సుమారు కోటి మందికి పరీక్షలు చేసినట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో 16.11 లక్షల రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మరో 12.11 లక్షల మందికి ప్రిస్ర్కిప్షన్ అద్దాల కోసం రిఫర్‌చేశారు. అయితే వీరిలో మెజార్టీ బాధితులకు ఇప్పటికీ అద్దాలు అందలేదని సమాచారం. క్యాంపులను సంప్రదించినా సరైన సమాధానం ఇవ్వడం లేదని బాధితులు పేర్కొంటున్నారు.
ఇక క్యాంపులకు ప్రజలు రకపోయినా.. రికార్డుల కోసం స్క్రీనింగ్ చేసినట్లు ఎంట్రీ చేస్తున్నట్లు తెలిసింది. వ్యాక్సినేషన్, ఆశా వర్కర్ల డేటా బేస్‌లో కంటి వెలుగులో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని స్వయంగా స్టాఫ్స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నా.. క్వాలిటీ కంట్రోల్ టీమ్‌లు మానిటరింగ్ చేయకపోవడం గమనార్హం.