- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ బీజేపీలో ఆ ఎఫెక్ట్ తో సీన్ మొత్తం రివర్స్
దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికల ముంగిట్లో రాష్ట్ర రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరుతున్నారు. దీంతో హస్తం పార్టీలో చేరికల జోష్ కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ లో చేరుతున్న వారిలో ప్రముఖులంతా బీఆర్ఎస్ నేతలే ఉండగా బీజేపీ నుంచి పెద్దగా చేరికలు లేకపోవడం చర్చగా మారాయి. బీజేపీ నుంచి సైతం పలువురు నేతలు పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతం ఆ అంశం ముందుకు సాగడం లేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పడిన పరిణామాలు, పార్టీలో అంతర్గత వ్యవహారాలతో కీలక నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారనే వార్తలు జోరుగా వినిపించాయి. కానీ అనూహ్యంగా ప్రస్తుతం వారంతా సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీని వీడుతామని ప్రచారం జరిగిన నేతలు నిజంగానే వెనక్కి తగ్గారా లేక వారు పార్టీ మారకుండా ఆగేందుకు పార్టీ పెద్దలు ఏదైనా హామీ ఇచ్చారా అనేది చర్చగా మారింది.
ఊరిస్తున్న తెలంగాణ మంత్రి పదవులు:
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన గ్రూప్ తగాదాలు తెలంగాణ బీజేపీకి నష్టం కలిగించాయనే విశ్లేషణలు వినిపించాయి. ఫలితాల అనంతరం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో జాతీయ నాయకత్వం, సంఘ్ పరివార్ పెద్దలు సైతం రాష్ట్ర నేతలకు తలంటాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చర్చ ఉన్నది. ఈ క్రమంలో నేతల మధ్య విభేదాలతో పలువురు నేతలు తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధం అయ్యారని కాంగ్రెస్ సంప్రదింపులు సైతం జరిపినప్పటికీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే అలా వారు పార్టీ మారకుండా ఆగిపోవడం వెనుక కేంద్ర మంత్రిపదవులు ఊరించడమే కారణం అనే టాక్ వినిపిస్తోంది. కేంద్రంలో మరోసారి బీజేపీనే అనే ధీమా కమలనాధులలో కనిపిస్తోంది. కేవలం టికెట్ దక్కించుకుంటే చాలు గెలపు నల్లేరుమీద నడకే అనే అంచనాలతో బీజేపీ నేతలు ఉన్నారు. ఒక వేళ తమకు టికెట్ దక్కి గెలుపొందితే కేంద్రంలో మంత్రి పోస్ట్ దక్కించుకోవచ్చనే పార్టీ పెద్దలే రాష్ట ఆశతో పలువురు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఇతర పార్టీల నుంచి ఆఫర్ వచ్చినా ప్రస్తుతానికి రెస్పాండ్ కావడం లేదనే చర్చ జరుగుతోంది.
ఎవరి ప్రయత్నాలు వారివే:
బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం హడావుడి మొదలైంది. సిట్టింగ్ ఎంపీలలో ఎవరికి చోటు దక్కబోతున్నదన్న సస్పెన్స్ తో పాటు మిగతా చోట్ల ఎవరిని అభ్యర్థులుగా నిలపబోతున్నారనేది ఉత్కంఠ రేపుతున్నది. దీంతో సిట్టింగ్ ఎంపీలు ఉన్న 4 స్థానాలతో మిగతా 13 సెగ్మెంట్లలో టికెట్ కోసం నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన సెగ్మెంట్లలో టాప్ లీడర్ల మధ్య టికెట్ కోసం గట్టి పోటీ నెలకోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిన ఈటల రాజేందర్ ఈసారి మల్కాజ్ గిరి స్థానం కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఇదే స్థానం నుంచి మురళీధర్ రావుతో పాటు మరి కొంత మంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ స్థానం నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. వీరితో పాటు మిగతా చోట్ల కూడా తీవ్రమైన పోటీనే నెలకొన్న నేపథ్యంలో టికెట్ కొట్టేయబోతున్న నేతలెవరు? గెలిస్తే కేంద్ర మంత్రులయ్యేది ఎవరు? అనేది ఉత్కంఠగా మారింది.