- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ త్యాగరాజు! అద్దంకికి మళ్లీ హ్యాండ్ ఇచ్చిన పార్టీ?
దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గణేష్ పేరును తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీఆర్ఎస్ నేత లాస్య నందిత ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనే ఈ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.
అద్దంకికి మళ్లీ నిరాశే!
అయితే కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినట్లు సమాచారం. కానీ అద్దంకి దయాకర్‌ను కాదని ఇటీవల బీజేపీని వీడీ కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ గణేష్‌కు ఏఐసీసీ టికెట్ ఇచ్చింది. దీంతో టికెట్ ఆశించినట్లు తెలుస్తున్న అద్దంకి దయాకర్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్‌కు పార్టీ అనేక సార్లు హ్యాండ్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అద్దంకి తుంగతుర్తి టికెట్ ఆశించారు. చివరకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో మందుల సామేల్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. తర్వాత ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్ అద్దంకి ఆశించారు. పార్టీ పెద్దలు సైతం అద్దంకి దయాకర్‌కు ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించి.. చివరి నిమిషంలో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్‌కు పార్టీ ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయన టికెట్ ఆశించినట్లు తెలుస్తోంది. కానీ ఆయనకు టికెట్ ప్రకటించే ఆవకాశం లేనట్లు పోలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.
తెలంగాణ త్యాగరాజు!
కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్‌కు హ్యండ్ ఇచ్చిందని సోషల్ మీడిమా వేదికగా చర్చజరగుతోంది. తెలంగాణ త్యాగరాజు! అంటూ సోషల్ మీడియా వేదికగా అద్దంకిని విమర్శిస్తున్నారు. మరోవైపు ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తున్నారు.