- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అట్టహాసంగా ప్రారంభమైన ‘సీఎం కప్’.. ఆకట్టుకున్న రాహుల్ సిప్లిగంజ్ ఫెర్ఫామెన్స్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సీఎం కప్ 2023 రాష్ట్రస్థాయి పోటీల ప్రారంభోత్సవ వేడుకలు సోమవారం ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి ప్రారంభించారు. అర్జున అవార్డు గ్రహీతలు ములినీ రెడ్డి, జేజే శోభ, నిఖత్ జరీన్, ఉసాముద్దీన్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గ్రామీణ యువతకు క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతో సీఎం కప్ నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే క్రీడాకారులకు సమున్నత గౌరవం దక్కిందన్నారు. 33 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోని 6 స్టేడియాల్లో 18 క్రీడాంశాల్లో జరుగుతున్న ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10వేలకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. కార్యక్రమంలో క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ ఓ ఎస్ డి లక్ష్మి, ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి, కార్యదర్శి జగదీష్ యాదవ్, కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జల నగేష్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, అనిల్ కుర్మాచలం, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ సంగీతవిభావరి కార్యక్రమం ఆకట్టుకుంది.