- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
త్వరలో మారనున్న టీఎస్ ఆర్టీసీ పేరు

దిశ, వెబ్ డెస్క్: 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పలు కీలక మార్పులు చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్(TS) ను తెలంగాణ(TG) మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు కీలక ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆధీనంలో నడిచే ప్రైవేట్ సంస్థలు పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే కొత్తగా వచ్చే అన్ని వాహనాల నెంబర్ ప్లేట్ లపై కూడా టీజీ నే వస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థ అయిన.. టీఎస్ ఆర్టీసీ పేరు మార్పులో సంస్థ స్పందించింది. త్వరలోనే టీఎస్ఆర్టీసీ ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ గా లోగో మార్పులు చేసి కొత్త లోగోను ప్రకటిస్తామని ఆర్టీసీ సంస్థ అధికారులు స్పష్టం చేశారు.