- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Gold: బ్యాంకులో భారీగా బంగారం మాయం.. ఆడిట్‌లో బయటపడిన సంచలన నిజాలు

దిశ, వెబ్ డెస్క్: డబ్బులు అత్యవసరం వచ్చి తాకట్టు పెడితే బ్యాంకులో ఉన్నట్టుండి బంగారం మాయం(Gold Miss) అయింది. ఈ ఘటనలో ఆదిలాబాద్(Adilabad)లో జరిగింది. పట్టణంలోని ఓ బ్యాంకు(Bank)లో ప్రజలు డబ్బు అవసరాల నిమిత్తం స్థానికులు బంగారం పెట్టి లోన్(Loan) తీసుకున్నారు. మొత్తం ఒకేసారి కట్టి విడిపించుకోలేక ప్రతి నెల వడ్డీ కడుతూ వస్తున్నారు. బ్యాంకులో బంగారం సేఫ్‌గా ఉందనుకున్నారు. అయితే బ్యాంకు అధికారులు అంతర్గతంగా ఇటీవల జరిపిన ఆడిట్(Audit)లో సంచలన విషయం బయటపడింది. 50.74 తులాల బంగారం మాయం అయినట్లు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బ్యాంకు మేనేజర్(Bank Manager) వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయమైన బంగారం విలువ రూ. 30 లక్షలు వరకూ ఉంటుందని తెలిపారు. అంతేకాదు 199.10 గ్రాములు నకిలీ బంగారం బ్యాంకులో ఉన్నట్లు కాంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ విషయం బయటకు తెలియడంతో గోల్డ్ లోన్ తీసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుకు ఫోన్ చేస్తున్నారు. మాయం అయిన బంగారం ఎవరివో వివరాలు తెలపాలని కోరుతున్నారు. తమ బంగారం మాయమైతే న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం బంగారం మాయం విషయం ఆదిలాబాద్ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.