- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమపై ఉన్న కేసులను ఎత్తివేయాలి.. సీఎం రేవంత్ రెడ్డికి కోదండరామ్ రిక్వెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్‌కు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారని తెలిపారు. ఆర్థిక పరమైన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని క్యాట్ చెప్పిందన్నారు. మెడిగడ్డ ప్రాజెక్టు డిజైన్ ఒకటైతే.. నిర్మాణం మరొక రకంగా చేయడంతో కుంగిపోయిందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణ మెటీరియల్ సక్రమంగా లేదని, నిర్వహణ కూడా లేదని డ్యాం సేప్టీ అధికారులు చెప్పారన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి కాలువల ద్వారా నీరుని తీసుకురాగలిగితే గతంలో ఖర్చు చేసిన నిధులకు సార్థకత దక్కుతుందన్నారు.
తుమ్మిడిహెట్టి పరిశీలించాలని ప్రభుత్వం, కమిషన్ ను కోరినట్లు చెప్పారు. ఇంజనీర్ సూచనలను గత ప్రభుత్వం బేఖాతరు చేసిందని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు అవినీతి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణ కమిషన్ వేయాలని కోరిందే బీఆర్ఎస్, కమిషన్ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అసెంబ్లీలో బీఆర్ఎస్ కోరిందని వెల్లడించారు. ప్రజల సొమ్మును బాధ్యతగా ఖర్చు చేయాలని, విచారణ కమిటీని రద్దు చేయించి.. వాస్తవాలు బయటకు రాకుండా ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తనపై ఉన్న కేసులు ఎత్తివేయాలని కోరడం బాధ్యతారాహిత్యం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో తమపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. బొగ్గు గనులను వేలం వేయడమంటే ప్రైవేటీకరణకు దారి తీస్తుందని, బొగ్గు గనులను సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.