TGSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బెంగళూరు రూట్ వారికి సూపర్ డిస్కౌంట్!

by Ramesh N |
TGSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బెంగళూరు రూట్ వారికి సూపర్ డిస్కౌంట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు (Bengaluru) రూట్ ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. తెలంగాణలో బెంగళూరు మార్గంలో ప్రయాణించే వారి ఆర్టీసీ సూపర్ డిస్కౌంట్ ఇచ్చింది. ఆ మార్గంలో ప్రయాణించే వారికి టీజీఎస్ఆర్టీసీ 10 శాతం రాయితీ కల్పించింది. బెంగళూరుకు నడిచే అన్ని సర్వీసులకు ఈ డిస్కౌంట్ వర్తింపు ఉటుందని పేర్కొంది. ఏసీ స్లీపర్(బెర్త్), ఏసీ స్లీపర్ స్టార్(సీటర్), రాజధాని, నాన్ ఏసీ స్లీపర్ (బెర్త్), నాన్ ఏసీ సీటర్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ రాయితీ లభిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా అవుతుందని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. వివరాలు, టికెట్ల రిజర్వేషన్ కోసం ఆర్టీసీ వెబ్‌సైట్ www.tgsrtcbus.inను సంప్రదించాలని తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది.

Next Story

Most Viewed