TG Budget 2024 : నేడు తొలిసారి అసెంబ్లీకి ప్రతిపక్షనేత హోదాలో హాజరు కానున్న KCR

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-25 04:34:57.0  )
TG Budget 2024 : నేడు తొలిసారి అసెంబ్లీకి ప్రతిపక్షనేత హోదాలో హాజరు కానున్న KCR
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో నేడు 2024-25 వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి ప్రవేశపెట్టనున్నారు. కాగా, బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ నేడు ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన 7 నెలల తర్వాత శాసనసభకు గులాబీ బాస్ రానుండటంతో ఆసక్తి నెలకొంది. కేవలం ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అయితే అసెంబ్లీ లాబీల్లో కేసీఆర్‌కు కేటాయించిన చాంబర్‌లో ఎలాంటి మార్పులు ఉండవని శాసనసభ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్‌కు ఇరుకైన చాంబర్ కేటాయించారని గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.

అయితే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య జరిగే పరిణామాలపై పొలిటికల్ సర్కిల్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నేత అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను నిలదీస్తున్నారు. అయితే అసెంబ్లీకి హాజరు కాకపోతే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుందని అందుకే శాసనసభకు వచ్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం బయలుదేరి వెళ్లనున్నారు.

Advertisement

Next Story