TG Assemby: నేడు అసెంబ్లీలో శాఖల పద్దులపై చర్చ.. 21 శాఖల గ్రాంట్లపై సర్కార్ వివరణ

by Shiva |
TG Assemby: నేడు అసెంబ్లీలో శాఖల పద్దులపై చర్చ.. 21 శాఖల గ్రాంట్లపై సర్కార్ వివరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 21 శాఖలకు సంబంధించిన గ్రాంట్లపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరగనున్నది. మరో 19 శాఖలకు సంబంధించిన పద్దులపై మంగళవారం చర్చ జరగనున్నది. ఈ రెండు రోజుల పాటు సమావేశాలు అసెంబ్లీకి మాత్రమే పరిమితం కానున్నాయి. శాసనమండలికి సోమ, మంగళవారాలు సెలవు కావడంతో ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లో బుధవారం చర్చ జరగనున్నది. తొలి రోజున (సోమవారం) అసెంబ్లీలో ప్లానింగ్, ఎనర్జీ, పురపాలక, పరిశ్రమలు, ఐటీ కమ్యూనికేషన్స్, ఎక్సయిజ్, హోమ్, లేబర్, కమర్షియల్ టాక్స్, స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్ పోర్ట్, బీసీ వెల్ఫేర్ తదితర శాఖలకు సంబంధించిన డిమాండ్లు, గ్రాంట్లపై చర్చ జరగనున్నది.

బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల ప్రకారం నిర్వహణ పద్దు, ప్రగతి పద్దులకు ప్రభుత్వం ఎంతెంత ఖర్చు పెట్టనున్నదో వెల్లడించనున్నది. సభ్యుల సందేహాలకు, లేవనెత్తిన అంశాలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. ఇందులో హోమ్, పురపాలక, మూడు రకాల ఎడ్యుకేషన్ తదితర శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ నిర్వహిస్తున్నందున ఆయనే సమాధానం ఇస్తారా?... లేక మంత్రులకు అప్పజెప్తారా అనేది స్పష్టం కానున్నది.

Advertisement

Next Story

Most Viewed