- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Assembly: ఆ బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే.. ఎమ్మెల్యే గంగుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నాలుగో రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ (BC Reservation) బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలోనే బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లును తాము స్వాగతిస్తున్నామని అన్నారు. బిల్లును ఆహ్వానిస్తూ.. తాము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ (Parliament)లో బిల్లు ఆమోదం పొందితేనే సంపూర్ణ సంతోషం ఉంటుందని అన్నారు. చాలా రాష్ట్రాలు 50 శాతంపైగా రిజర్వేషన్లు ప్రతిపాదించి విఫలమయ్యారని గుర్తు చేశారు.
కేవలం ఒకే ఒక్క తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. తమిళనాడు తరహా విధానాన్ని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకునే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పైనే ఉందని తెలిపారు. తమిళనాడులో కులాల ప్రతిపాదికన బీసీ కమిషన్ ఆధ్వర్యంలో సర్వే చేశారని.. ఏడాది పాటు సర్వే చేసి నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం 1992లో చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందని.. ఆ తీర్పు ప్రకారమే జయలలిత ప్రభుత్వం 69 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.