TG Assembly: అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన

by Shiva |
TG Assembly: అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ (Assembly) ఆవరణలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. లగచర్ల (Lagacharla) రైతుకు బేడీలు వేసి వైద్య పరీక్షలు తీసుకెళ్లడం పట్ల విపక్ష సభ్యులు తీవ్ర అభ్యతరం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకోగా కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy) మాట్లాడుతూ.. బీఏసీ (BAC)లో చర్చించకుండానే అసెంబ్లీ (Assembly) ఎజెండా ఖరారు చేయడం దారుణమని అన్నారు. టూరిజం (Tourism) మీద చర్చించాల్సి సమయం ఇది కాదని.. లగచర్ల (Lagacharla) రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. నెల రోజులు జైల్లో వేసేంత తప్పు లగచర్ల రైతులు ఏం చేశారని ప్రశ్నించారు. రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన సర్కార్.. యావత్ తెలంగాణ రైతులను అవమానించిందని పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed