లోనికి వెళ్లి తాళం వేసుకున్న పాస్టర్.. ముషీరాబాద్ హైబ్రోన్ చర్చి వద్ద ఉద్రిక్తత

by Gantepaka Srikanth |
లోనికి వెళ్లి తాళం వేసుకున్న పాస్టర్.. ముషీరాబాద్ హైబ్రోన్ చర్చి వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లోని ముషీరాబాద్ హైబ్రోన్ చర్చి(Musheerabad Hebron Church) వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చర్చిపై ఆధిపత్యానికి రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. పాస్టర్ వీరాచారి వర్గం చర్చిలోనికి వెళ్లి తాళం వేసుకున్నారు. మరో వర్గం గేటు బయట ఆందోళన చేపట్టింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని సుమారు 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇరు వర్గాలను చెదరగొట్టారు.

కాగా, గతకొంత కాలంగా కొంతకాలంగా చర్చిపై ఆధిపత్యానికి ఇరువర్గాల మధ్య పోరు సాగుతోంది. సొసైటీ సభ్యులు(Society Members) బౌన్సర్లను పెట్టి చర్చిని స్వాధీనం చేసుకుని, తమను ప్రార్థనలకు అనుమతించడంలేదని ట్రస్ట్ సభ్యులు ఇటీవలే ఆరోపణలు చేశారు. ఇవాళ ప్రార్థనలు చేస్తామంటూ.. చర్చి వద్దకు ట్రస్టు సభ్యులు చేరుకున్నారు. ట్రస్ట్ సభ్యులను లోపలికి అనుమతించకుండా లోనికి వెళ్లి తాళాలు వేసుకున్నారు. గేటు బద్దలు కొట్టి హేబ్రోన్ చర్చి లోపలికి ట్రస్ట్ సభ్యులు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం చర్చి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Next Story

Most Viewed