- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదేళ్లు ఫ్రెండ్లీ పార్టీ.. అయినా కవిత అరెస్ట్‌పై MIM సైలెంట్ వెనక స్కెచ్ ఇదేనా..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ ఎంఐఎం పార్టీతో ఫ్రెండ్లీగా ఉంటూ వస్తున్నారు. అయితే పదేళ్లుగా ఈ రెండు పార్టీలు స్నేహ బంధాన్ని కొనసాగించాయి. ముస్లిం ఓటర్లు ఎంఐఎం పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్‌కు ఓటేయాలని రెండు పర్యాయాలు అసదుద్దీన్ ఓపెన్‌గా ప్రజలకు రిక్వెస్ట్ చేశారు. అయితే తాజాగా బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం కోల్పోవడం.. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ కావడం వంటి పరిణామాలతో ఆ పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. బీజేపీ అంటే ఒంటి కాలిపై లేచే అసదుద్దీన్ ఒవైసీ కానీ, మరో ఎంఐఎం ముఖ్య నేత అక్బరుద్దీన్ కానీ కవిత అరెస్ట్‌పై స్పందించకపోవడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కవిత అరెస్ట్‌ను యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా పలువురు నేతలు ఖండించగా బీఆర్ఎస్‌తో పదేళ్లు ఫ్రెండ్లీ ఉన్న ఎంఐఎం స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
MIM సైలెంట్‌కు కారణమదేనా..?
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరినా నేపథ్యంలో ఎంఐఎం నేతలు హస్తం పార్టీకి ఒక్క సారిగా ఫ్రెండ్లీ పార్టీగా మారిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెడుతూ విచారణకు ఆదేశిస్తున్న రేవంత్ సర్కారుతో వైరం వద్దనుకుంటున్నందునే ఎంఐఎం చీఫ్ అసద్, మరో కీలక నేత అక్బరుద్దీన్ సహా ఇతర నేతలంతా సైలెంట్ అయిపోయారనే టాక్ నడుస్తోంది. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండనుండటంతో ఇక మాజీ ముఖ్యమంత్రి కూతురు అరెస్ట్‌పై స్పందించాల్సిన అవసరం లేదని పతంగి పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా జరిగే అనేక అంశాలపై స్పందించే అసదుద్దీన్ కేసీఆర్ కూతురు అంశంలో మాత్రం ఆచితూచి వ్యవరిస్తున్నారు. మరో వైపు బీజేపీ ప్రతిపక్ష పార్టీల కేసులపై ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో కవిత ఇష్యూపై సైలెంట్‌గా ఉండటమే బెటర్ అని ఎంఐఎం నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.