- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Telangana Thalli: నిజంగా తెలంగాణ తల్లే మాట్లాడుతోందా? ఏఐ టెక్నాలజీ వీడియో వైరల్ (వీడియో)

దిశ, డైనమిక్ బ్యూరో: కాదేదీ కళకు అనర్హం అన్నట్లు.. కాదేదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి అనర్హం అన్నట్లుగా నేడు మారింది. (AI Technology) ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఎన్నో ఆసక్తికర వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఏఐ టెక్నాలజీతో (Telangana Talli) తెలంగాణ తల్లిని మాట్లాడించిన వీడియో ఒకటి తాజాగా చక్కర్లు కొడుతోంది. ఏఐతో తెలంగాణ తల్లిని మాట్లాడిస్తూ..‘నేను మీ తెలంగాణ తల్లిని, ఎన్నో ఆత్మ బలిధానాలు మధ్య నన్ను తెచ్చుకున్న నా బిడ్డలారా? మీ అందరికీ నేను తోడుగా తెలంగాణ ముఖ చిత్ర రూపంలో నేను ఎప్పుడు మీ వెన్నంటే ఉండి మీకు ధైర్యాన్ని ఇస్తాను.
తెలంగాణ ఎప్పుడు సశ్యశామలంగా కోటి రతనాలతో పచ్చని తోరణంలా కళకళలాడుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా దీవెనలు మీకు ఎప్పటికీ ఉంటాయి.’ అంటూ ఏఐ టెక్నాలజీతో తెలంగాణ తల్లి మాట్లాడింది. నిజంగానే (Telangana Thalli) తెలంగాణ తల్లి మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఈ వీడియో చూసి పలువురు నెటిజన్లు ఫిదా అయిపోయారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి 20 అడుగుల విగ్రహాన్ని (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ తల్లి రూపం చర్చానీయాంశంగా మారింది.