- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దర్శనాలకు సంబంధించి TTD కీలక నిర్ణయం.. తెలంగాణ మంత్రి హర్షం

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్లే తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ(TTD) శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు కూడా శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మార్చి 24 నుంచి ఈ విధానం అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ఆదేశాల మేరకు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలను వారంలో రెండు రోజులు మాత్రమే అనుమతిస్తారు.
ఒక సిఫార్సు లేఖపై ఆరుగురికి అవకాశం ఉండనుంది. టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంపై తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు(TTD Board)తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం(AP Government) వెంటనే స్పందించడం పట్లం హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఇదే విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి కొండా సురేఖ లేఖ రాసిన విషయం తెలిసిందే.